Wednesday, July 9, 2025

రూ.75 లక్షల మోసం.. ఆలియా మాజీ అసిస్టెంట్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మాజీ అసిస్టెంట్ వేదికా శెట్టిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వేదికా శెట్టి అలియా భట్ ప్రొడక్షన్ హౌస్ నుండి 76 లక్షల రూపాయలు మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. మే 2022 నుండి ఆగస్టు 2024 వరకు నకిలీ బిల్లులతో మోసం చేసినట్లు సమాచారం. నకిలీ బిల్లులను సృష్టించి, వాటిపై ఆలియా సంతకం తీసుకుని, ఆ తర్వాత మొత్తం డబ్బును వేదిక తన స్నేహితురాలి ఖాతాకు బదిలీ చేసేది. ఈ విధంగా, రెండేళ్లలో దాదాపు 76 లక్షల రూపాయలు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

డబ్బులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తూ ఆలియా తల్లి సోని రజ్దాన్.. జనవరిలో వేదికపై జుహు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఆరోపణల నేపథ్యంలో గత 5 నెలలుగా వేదిక పరారీలో ఉంది. ఎట్టకేలకు బెంగళూరులో వేదికను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చి.. జూలై 10 వరకు ఆమెను కస్టడీకి తీసుకున్నారు. ఇందులో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే కోణంలో అధికారులు ప్రస్తుతం ఆర్థిక డేటాను పరిశీలిస్తున్నారు.

కాగా, ఆలియా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీ ఉంది. రణబీర్ కపూర్ నటిస్తున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 2: దేవ్, రణబీర్-విక్కీ కౌశల్ కాంబినేషన్ వస్తున్న లవ్ అండ్ వార్ చిత్రాలలో అలియా నటిస్తోంది. అలాగే, YRF నిర్మాణంలో వస్తున్న ఆల్ఫా మూవీలో నటిస్తోంది. అలియా చివరిసారిగా వసంత్ బాలా తెరకెక్కించిన జిగ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News