Wednesday, July 9, 2025

సిగాచి పరిశ్రమ పేలుడు ఘటన.. 44కు చేరిన మృతుల సంఖ్య.. లభించని ఏడుగురి ఆచూకీ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు పరిధిలోని పాశమైలారంలో ఉన్న సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 44కి చేరింది. ఆచూకీ లేని తొమ్మిది మందిలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 143 మంది కార్మికులు పని చేస్తుండగా ఇప్పటివరకు 44 మంది మృతులను గుర్తించారు. ఇంకా ఏడుగురి ఆచూకీ లభించలేదు. 10 రోజులుగా సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.

కాగా, ఈ ఘటనకు సంబంధిత కంపెనీ యాజమాన్యానిదే బాధ్యత అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. బాధిత కుటుంబాలను మానవతా దృక్పథంతో అన్నివిధాలుగా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు, వికలత్వం సంభవించి విధులకు వెళ్లలేని వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడి పని చేసుకోగలిగిన వారికి ఐదేసి లక్షలు పరిహారం అందేలా చూస్తామని అన్నారు. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులకు అయ్యే వైద్య ఖర్చులన్నీ నూటికి నూరు శాతం తమ ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుబాల్లోని పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యను అందిస్తామని తెలిపారు. తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు రూ. లక్ష, గాయపడిన వారికి రూ.50 వేలు జిల్లా కలెక్టర్ నిధుల నుంచి ఇస్తున్నట్టు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News