ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) మంచి ఫామ్‌లో ఉన్నాడు. జరిగిన రెండు టెస్టుల్లోనూ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. అయితే లార్డ్స్ వేదికగా జరిగే మూడో టెస్ట్‌లో రిషబ్ ఓ అరుదైన రికార్డను సొంతం చేసుకొనే అవకాశం ఉంది. టెస్ట్ మ్యాచుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు విధ్వంసకర బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 103 టెస్టుల్లో 90 సిక్సులు బాదాడు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు రోహిత్ 67 టెస్టుల్లో 88 సిక్సులు కొట్టాడు.
ఇక పంత్ (Rishabh Pant) కేవలం 45 టెస్ట్ మ్యాచుల్లోనే 86 సిక్సులు కొట్టాడు. ఒకవేళ మూడో టెస్ట్‌లో అతను 5 సిక్సులు కొడితే.. వీరూను దాటేస్తాడు. ఓవరాల్‌గా అయితే టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టింది బెన్ స్టోక్స్. స్టోక్స్ 113 మ్యాచుల్లో 133 సిక్సులు కొట్టాడు. ఈ లిస్ట్‌లో పంత్ 12వ స్థానంలో ఉన్నాడు. ఒకవేళ పంత్ ఈ మ్యాచ్‌లో ఐదు సిక్సులు కొడితే.. ఓవరాల్ జాబితాలో ఏడో స్థానానికి వెళ్లే అవకాశం ఉంది.