- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మంత్రులతో ప్రజలు నేరుగా కలిసి సమస్య చెప్పుకునే అవకాశం ఉండటం చాలా బాగుందని మంత్రి జి.వివేక్ వెంకటస్వామి (G.Vivek Venkataswamy) తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా ప్రజాపాలన నడుస్తోందని అన్నారు. గాంధీభవన్ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ..మంత్రులతో ముఖాముఖి చాలా మంచి కార్యక్రమం అని తెలియజేశారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా ప్రజాస్వామ్య పాలన నడుస్తోందని, జిల్లాల్లో కూడా కలెక్టర్లు ప్రజాపాలనను సమర్థవంతంగా (Effective public administration) నిర్వహిస్తున్నారని, గ్యారంటీల అమలును పరిశీలించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం అని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
- Advertisement -