Monday, August 25, 2025

34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసి గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలోని 34 ప్రభుత్వ మె డికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) గ్రీన్ సి గ్నల్ ఇచ్చింది. ఒక్క కాలేజీకి కూడా జరిమానా విధించలేదు. అ లాగే ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా ఎన్‌ఎంసీ ప్రశంసించింది. ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు టీచింగ్ ఫాకల్టీకి పెద్ద సంఖ్యలో ప్రభుత్వం ఇటీవ ల పదోన్నతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు, అదనపు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. వీరందరికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌గా, టీచింగ్ హాస్పిటళ్లకు సూపరింటెండెంట్లుగా నియమించింది. అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 278 మందికి, ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించింది. ఈ పదోన్నతులతో అన్ని కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత,

శాఖాపరమైన హెచ్‌ఓడిల సమస్య తీరనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుమారు 231 మందిని అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ చర్యలు ప్రారంభించింది. కాగా అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్ డీఎంఈ వంటి పోస్టులను నేరుగా రిక్రూట్ చేసుకునే అవకాశం లేకపోవడంతో, ప్రమోషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవిగాక సుమారు మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ అంశాలన్నీ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ అధికారులు ఎన్‌ఎంసీకి వివరించారు. దీంతో ఎన్‌ఎంసీ సంతృప్తి వ్యక్తం చేసింది.

21 బోధనాసుపత్రుల్లో సుమారు 6 వేల బెడ్లు ఏర్పాటు
కొన్ని టీచింగ్ హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్య తక్కువగా ఉందని ఎన్‌ఎంసీ అభ్యంతరం లేవనెత్తింది. ఈ నేపథ్యంలో 21 బోధనాసుపత్రుల్లో కలిపి సుమారు 6 వేలకుపైగా బెడ్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రతి కాలేజీ పర్యవేక్షణకు మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలు అన్ని కాలేజీల్లో పర్యటించి, కాలేజీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. రాష్ట్రంలో 2022 నుంచి 2024 మధ్యలో ఒకేసారి 25 కాలేజీలు ఏర్పాటైన తీరును ఎన్‌ఎంసీకి అధికారులు వివరించారు. అన్ని కాలేజీలు, వాటి అనుబంధ టీచింగ్ హాస్పిటళ్లకు భవనాలను నిర్మిస్తున్న విషయాన్ని ఎన్‌ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఎన్‌ఎంసీ, అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. రానున్న నాలుగు నెలల్లో పూర్తిస్థాయిలో అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని ఎన్‌ఎంసీ సూచించింది. ఈ మేరకు అన్ని కాలేజీలకూ పర్మిషన్లను యథావిధిగా కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది. మరోవైపు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు కాళోజి హెల్త్ యూనివర్సిటీ సిద్ధమవుతోంది. త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంకులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News