Friday, July 11, 2025

హెచ్‌సిఎ అధ్యక్షుడు జగన్‌మోహన్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ)మధ్య జరిగిన వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ వివాదంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరొకరిని సిఐడి అధికారులు బుధవారం అదుపులోకి తీ సుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఐపిఎల్ మ్యాచుల సం దర్భంగా ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సిఎ మధ్య టికెట్ల విక్రయంలో వి వాదం నెలకొన్న విషయం తెలిసిందే. మ్యాచ్ సందర్భంగా తమ కు టికెట్స్ కేటాయించలేదని సన్ రైజర్స్ టికెట్ కౌంటర్‌కు హెచ్‌సిఎ తాళం వేసింది. దీనిని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది.

తాము హైదరాబాద్‌లో నిర్వహించే మ్యాచ్‌లను రద్దు చేసుకుంటామని ప్రకటించింది. దీంతో ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. టికెట్ల కోసం ఎస్‌ఆర్‌హెచ్ యజమాన్యాన్ని హె చ్‌సిఏ అధ్యక్షుడు ఇబ్బందులకు గురిచేసినట్లు దర్యాప్తు లో నిర్ధారణ అయినట్టు తెలిసింది. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం పది శాతం టికెట్లను మాత్రమే హెచ్‌సిఎకు ఉచితంగా కేటాయించింది. దీనికి అదనంగా మరో 10 శాతం టికెట్లు కావాలని హెచ్‌సిఏ డిమాండ్ చేయగా అధికారికంగా హెచ్‌సిఎ ద్వారా కోరితే టికెట్లు ఇచ్చేందుకు ఎస్‌ఆర్‌హెచ్ అంగీకరించింది. అయితే అనధికారికంగా తనకు వ్యక్తిగతంగా పది శాతం టికెట్లు కావాలని జగన్మోహన్ డిమాండ్ చేసినట్టు దర్యాప్తులో తేలినట్టు సమాచారం. మొత్తంగా 30 శాతం టిక్కెట్లు కావాలని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను హెచ్‌సిఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు బెదిరించినట్లు తేలింది.

దీంతో మ్యాచ్‌ల సందర్భంగా జగన్మోహన్‌రావు తమను ఇబ్బందులకు గురిచేశారని సన్ రైజర్స్ ఆరోపించింది. మ్యాచ్ సందర్భంగా విఐపి గ్యాలరీలకు హెచ్‌సిఏ తాళాలు వేసి ఇబ్బందులకు గురి చేసిన విషయం కూడా వాస్తవమేనని విజిలెన్స్ విచారణలో తేలింది. దీంతో హెచ్‌సిఎపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది. హైదరాబాద్ లో రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించడానికి హెచ్‌సిఎకు ఒక్కో మ్యాచ్‌కు రూ. కోటి చెల్లించినప్పటికీ తమను ఇబ్బందులకు గురి చేయడం పట్ల జగన్మోహన్‌రావు పై సన్ రైజర్స్ ఫిర్యాదు చేయడం, దీనిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడం, అది తన దర్యాప్తు పూర్తి చేసి సిఐడికి అప్పగించడంతోవారి దర్యాప్తు ఆధారంగా సిఐడి అధికారులు జగన్మోహన్‌రావుతో పాటు మరొకరిపై కేసు నమోదు చేసిఅరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. ఇదే వివాదం కాకుండా హెచ్‌సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. ఈయన ఎన్నికపై కూడా కోర్టులో పిటిషన్లు దాఖలు అయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News