మన తెలంగాణ/కెపిహెచ్‌బి: రాష్ట్ర రాజధాని హైదరాబా ద్ నగర నడిబొడ్డున అత్యంత జనసాంద్రత కలిగిన కూ కట్‌పల్లి ప్రాంతంలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. క ల్తీ కల్లు సేవించి ఐదుగురు మృతి చెందారు. కల్తీకల్లు సే వించి చికిత్స పొందుతున్న కూకట్‌పల్లి హెచ్‌ఎంటి హి ల్స్ సాయిచరణ్ కాలనీ,ఎల్లమ్మబండ, ఆల్విన్‌కాలనీ శంశీగూడా ప్రాంతాలకు చెందిన చాకలి బొజ్జయ్య (55), సీతారాం (47) , నారాయణమ్మ (65) స్వరూప (61), మౌనిక (25) లు మృతి చెందారు. కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పరిస్థితి విషమంగా ఉన్న వారికి మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కెపిహెచ్‌బి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
కల్తీ కల్లు సేవించిన మృతి చెందిన సీతారాం(47) భార్య అనిత కెపిహెచ్‌బి పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేసింది. తన భర్త మృతికి కల్తీ కల్లు కారణమని పేర్కొంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కెపిహెచ్‌బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాలమూరు జిల్లాకు చెందిన సీతారాం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి కూకట్‌పల్లి హెచ్‌ఎంటి హిల్స్‌లో నివాసముంటూ రోజు వారీ కూలీ చేస్తున్నాడు. ఈనెల 7న సాయంత్రం హెచ్‌ఎంటి హిల్స్‌లోని కల్లు కాంపౌండ్‌కు వెళ్ళి కల్లు తాగి ఇంటికి వచ్చాడు.
ఆరోజు నుంచి వాంతులు, విరోచనాలు ప్రారంభం కావడంతో దుండిగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందని గాంధీకి తరలించాలని అక్కడి వైద్యులు సూచన మేరకు గాంధీకి తరలించగా అప్పటికే సీతారాం మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ద్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లింగం తెలిపారు. అదేవిధంగా చౌదరిమెట్టు బాలరాజు భార్య స్వరూప మృతికి కల్తీకల్లు కారణమని పేర్కొంటూ అతని కుమారుడు ప్రేమానందచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కెపిహెచ్‌బి పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
మూడు కల్లు దుకాణాలు సీజ్… ఐదుగురి నిర్వాహకులపై కేసు నమోదు
కల్తీ కల్లు విక్రయించి పలువురి మరణానికి కారణమైన కూకట్‌పల్లి హెచ్‌ఎంటీ హిల్స్, శంశీగూడా, హైదర్‌నగర్ ప్రాంతాల్లోని మూడు కల్లు కంపౌండ్‌లపై ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ చర్యలు ప్రారంభించింది. మూడు కల్లు కంపౌండ్లలోని 674 లీటర్ల కల్తీ కల్లును నాశనం చేయడంతోపాటు కంపౌండ్ నిర్వాహకులైన చింతకింది నరేష్‌గౌడ్, కె. కుమార్‌గౌడ్, తీగల రమేష్‌గౌడ్ . టి. శ్రీనివాస్‌గౌడ్‌లపై కేసు నమోదు చేయడం జరిగిందని, ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవీ పేరుతో అధికారులు ప్రకటించారు.