Thursday, July 10, 2025

తెలంగాణలో యూరియా కొరత రావొద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలంగాణ అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చర్యలు తీ సుకోవాలని ఎరువుల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు.202324 రబీతో పోలిస్తే 202425లో 21శాతంఅదనం గా యూరియా అమ్మకాలు జరిగాయని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటి వరకు 12.4 శాతం అదనపు వినియోగం జరిగిందన్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల మధ్య ఎరువుల సమన్వయాన్ని చే స్తూ రైతులకు అందుబాటులో ఉండే
విధంగా చూసుకోవాలని అధికారులకు జేపీ నడ్డా సూచనలు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర రైతులకు ఊరట లభించింది.

జూలై, ఆగష్టు నెలల్లో యూరియాను నిరాటంకంగా సరఫరా చేయాలి
మంగళవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం కేంద్రమంత్రిని కలిసి రాష్ట్రానికి సరిపడా యూరియా, ఎరువులు సరఫరా చేయాలని కోరింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జూలై, ఆగష్టు నెలల్లో యూరియాను నిరాటంకంగా సరఫరా చేయాలని సిఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా రైతుల అవసరాలను తీర్చడానికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు అవసరమైన మేరకు సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆదేశించారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లీంచకుండా, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సమానంగా ఎరువులు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి అధికారులకు సూచించారు. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ప్రణామ్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు అందిస్తుందని కేంద్రమంత్రి సిఎం రేవంత్‌తో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News