మనతెలంగాణ/పేట్‌బషీరాబాద్/సిటీబ్యూరో: పబ్బుల మాటును బడాబాబులు చేస్తున్న డ్రగ్స్ దందా బట్టబయలైంది. పబ్బులకు డ్ర గ్స్ సరఫరా చేస్తున్న కీలక నిందితుడిని సైబరాబాద్ ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) పోలీసులు అరె స్టు చేయడంతో డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. డ్రగ్స్‌తో సంబంధం ఉన్న తొమ్మిది ప బ్బులపై ఈగల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పబ్బుల యజమానులుగా పలువు రు రాజకీయ నాయకులు ఉన్నట్లు తెలిసిం ది. కొంపల్లికి చెందిన అన్నమనేని సూర్య (34), హర్షను అరెస్టు చేసి 10గ్రాముల కొ కైన్, 3.2 గ్రాముల ఓజి కుష్ (గంజాయి) , 1.6 గ్రాముల ఎక్స్‌టసీ మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ పోలీసుల కథనం ప్ర కారం… ఇంజనీరింగ్, ఎంబిఏ చేసిన అన్నమనేని సూర్య బెంగళూరులో సేల్స్ మేనేజర్‌గా పనిచేశాడు. 2020లో హైదరాబాద్‌కు వచ్చి తనతో చదువుకున్న స్నేహితులను కలి సి డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించాడు. కొంపల్లిలో మల్నాడు రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసి న నిందితుడు దానిని డ్రగ్స్ వ్యాపారానికి అడ్డాగా మార్చాడు.
హిమాయత్‌నగర్‌కు చెందిన హర్ష, కరీంనగర్‌కు చెందిన సందీప్ జువ్వాడి, ఖాజాగూడకు చెందిన పల్లెపాక మోహన్‌తో కలిసి వారికి తెలిసిన వారికి డ్రగ్స్ సరఫరా చేశాడు. ఎపిలోని భీమవారానికి చెందిన కార్డియాలజీ డాక్టర్ ప్రసన్న నిందితుడి వద్ద ఇప్పటివరకు 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. సూర్య స్నేహితుడు హర్ష ద్వారా డాక్టర్ ప్రసన్న డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. సూర్య వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిలో వృత్తి నిపుణులు, జిమ్ యజమానులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వైద్యులు, పబ్ డైరెక్టర్లుతోపాటు పెద్ద సంఖ్యలో వినియోగదారుల పేర్లు ఉన్నట్లు తెలిసింది. 23 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసిన సూర్య ప్రముఖ పబ్ లకు వెళ్లి డ్రగ్స్ పార్టీ ఇచ్చాడు, పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ప్రిజం పబ్, ఫార్మ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్ , జోరా,క్వాక్ అరేనా, బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ ఇచ్చినట్లు విచారణలో తెలిసింది. పోలీసులు క్వాక్ పబ్బు యజమాని రాజా శేఖర, కోరా పబ్బు యజమాని పృథ్వి వీరమాచినేని, బ్రాడ్ వే ఓనర్ రోహిత్ మాదిశెట్టిపై కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి పార్టీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
నైజీరియన్ల నెట్‌వర్క్‌తో…
ఢిల్లీ, బెంగళూరు, గోవా నుండి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ల నెట్‌వర్‌తో సూర్య పరిచాయలు పెంచుకున్నాడు. నిక్, జెర్రీ, డెజ్మాండ్, స్టాన్లీ, ప్రిన్స్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశాడు. నైజీరియన్‌కు చెందిన నిక్ నుండి కొకైన్, ఎండిఎంఏను రెగ్యులర్‌గా కొనుగోలు చేశాడు. డ్రగ్స్ కొనుగోలు చేసిన నిందితుడు నిక్ బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్‌లో పంపించాడు. ‘టెర్నియన్ హాస్పిటాలిటీ‘ ద్వారా రూ. 1.39 లక్షలు, ఎంటిఎం ద్వారా మరో రూ.41,000 ట్రాన్స్‌ఫర్ చేశాడు. డబ్బులు తీసుకున్న నైజీరియన్లు డ్రగ్స్‌ను ఇంట్లో వాడే వస్తువుల్లో పెట్టి కొరియర్ ద్వారా పంపించారు. కొన్ని డ్రగ్స్‌ను మహిళల చెప్పుల్లో పెట్టి ఫాతీమా అనే పేరుతో సూర్యకు కొరియర్ చేశారు. ఇలా వచ్చిన డ్రగ్స్‌ను కారు, రెస్టారెంట్‌లో దాచి పెట్టువాడు. 2022లో స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లిన నిందితుడు సూర్య అక్కడ నైజీరియన్లు డెజ్మాండ్, స్టాన్లీ నుంచి కొకైన్ కొనుగోలు చేశాడు. న్యూఢిల్లీ వెళ్లినప్పుడు నైజీరియాకు చెందిన ప్రిన్స్‌ను సంప్రదించి అతడి వద్ద నుంచి కొకైన్ కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి విక్రయించాడు. 2021 నుంచి 2025 మధ్య 20 సార్లకు పైగా కొకైన్ కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. ఇలా కొనుగోలు చేసిన డ్రగ్స్‌ను హైదరాబాద్‌లోని పబ్బుల్లో వినియోగించినట్లు తెలిసింది.