Thursday, July 10, 2025

హరిత భవనాలకు ప్రోత్సాహకాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఒకనగర రాజ్యం గా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్రంలో పట్టణాల సంఖ్య గణనీయంగా ఉందని, ఆధునికత అభ్యుదయానికి కేంద్రంగా రా ష్ట్రం రోజురోజుకీ శర వేగంగా అభివృద్ధి చెందుతుందని అ న్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ ప్రైవేటు హోట ల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ఆధ్వర్యం లో బుధవారం నిర్వహించిన చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్లు (సిఎఫ్‌ఓ) సదస్సులో భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హ రిత భవనాలకు ప్రోత్సాహం కల్పిస్తామని ప్రకటించారు. పె ట్టుబడులకు హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం స్వర్గ ధామం లాంటిదని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో నైపు ణ్యం ఉన్న కార్మికులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధర కు లభిస్తారని, చక్కటి వాతావరణం, కాలుష్య రహితం, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి అనేక అంశాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని డిప్యూటీ సీఎం చెప్పారు.

నైపుణ్యం ఉన్న మానవ వనరులను సృష్టించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని 100 ఐటిఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు నగరాలు ఉన్నాయని, త్వరలో ఫ్యూచర్ సిటీ నాలుగో నగరంగా అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూ పుతున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామికవేత్త లు కీలకమన్న భట్టి రాష్ట్ర అభివృద్ధికి, ఉపాధి కల్పన, సంపద సృష్టికి పారిశ్రామికవేత్తల సలహాలు సూచనలు స్వీకరించి అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ మంత్రివర్గం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరో సా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను తమ కుటుంబ సభ్యులుగా పరిగణిస్తుందని, కలిసి సాగుదాం రాష్ట్రంలో మార్పుకు శ్రీకారం చూడదామని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలు సిఎస్‌ఆర్ నిధులను పాఠశాలలు, నాలెడ్జ్ సెంటర్ల కోసమే కాకుండా రైతులు, మహిళల ప్రగతి కోసం కూడా ఖర్చు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.

సిఎఫ్‌ఓలు సంస్థల దశ, దిశా నిర్దేశించే మార్గదర్శకులు
శరవేగంగా మారుతున్న ప్రపంచంలో ఆర్థిక రంగం కేవలం లెక్కల పరిరక్షణకే పరిమితం కాలేదని డిప్యూటీ సిఎం భట్టి అన్నారు. సిఎఫ్‌ఓలు ఇప్పుడు సంస్థల దశ, దిశను నిర్దేశించే మార్గదర్శకులు అని తెలిపారు. సిఎఫ్‌ఓలు వ్యూహకర్తలుగా, సాంకేతిక నిపుణులుగా ప్రమాదాల నిర్వహణలో శిల్పులుగా మారాలని డిప్యూటీ సీఎం సూచించారు. సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, అనలిటిక్స్, ఆటోమేషన్ ఇవన్నీ గొప్పల కోసం చెప్పుకునే మాటలు కాదు నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ఇవి మార్చి వేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఎన్నో రంగాల్లో సామర్థ్యం పెరిగిన దాఖలాలు మనకు ఉన్నాయని అన్నారు. లైఫ్ సైన్స్ నుంచి మొదలు పెడితే లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి పరిపాలన వరకు సామర్థ్యం పెరిగిందని తెలిపారు.

సిఎఫ్‌ఓలు ఆర్థిక నాయకులుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఓడిసిపట్టాలని, కేవలం ఆపరేషన్ సామర్థ్యం కోసం కాకుండా బలమైన వ్యూహాత్మక నిర్ణయాల కోసం టెక్నాలజీపై పట్టు సాధించాలని సూచించారు. తెలంగాణలో ఈ తరహా ఆశయాలకు అనువైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. ప్రగతిశీల విధానాలు, మంచి మౌలిక సదుపాయాలు, నవ ఆవిష్కరణల పట్ల స్ఫూర్తి, లైఫ్ సైన్సెస్, గ్రీన్ పవర్, పరిశ్రమల పెట్టుబడులకు తెలంగాణ ఒక ఆకర్షణీయ గమ్యంగా మార్చాయని ఆయన వివరించారు. అయితే అభివృద్ధిని కేవలం ఆర్థిక ఉత్పత్తిలోనే కొలవలేమని, దాని ప్రయోజనాలు ఎంత మేరకు అందరికీ చేరుతున్నాయో కూడా చూడాలని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్రతలు ప్రజా ప్రభుత్వ పాలనలో కేంద్ర బిందువులు అని తెలిపారు. ఈ దృష్టితోనే రాష్ట్రంలో ఎన్నో కీలక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.

ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం
ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ కింద 21 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించాలని నిర్ణయించి మొదటి సంవత్సరంలోనే రూ.21,500 కోట్లు వడ్డీ లేని రుణాలు రాష్ట్రంలో పంపిణీ చేశామని డిప్యూటీ సీఎం వివరించారు. మన ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే రాష్ట్ర ప్రజల బలం పెరగాలి, సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధి రెండు జోడెడ్ల మాదిరిగా పరుగులు పెట్టాలన్నదే ఈ పథకాల వెనుక రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐఐ నిర్వాహకులు శేఖర్ రెడ్డి, శివ ప్రసాద్ రెడ్డి, బి.వి.ఆర్ మోహన్ రెడ్డి, ఎంవి నరసింహం, గౌతమ్ రెడ్డి, సమీయుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News