మేషం – దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతను ఇచ్చి సరికొత్త నిర్ణయాలు అమలు చేస్తారు. అనేక మందికి అనేక విధాలుగా సహాయం అందిస్తారు.
వృషభం – పనులలో ఏర్పడిన ఒడిదుడుకులను అధిగమించగలుగుతారు. నమ్మకం లేని వ్యక్తులకు పరిస్థితులకు లోబడి కొన్ని బాధ్యతలను అప్పగించవలసి వస్తుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి.
మిథునం – జీవిత భాగస్వామి ద్వారా ముఖ్య సమాచారం అందుతుంది.శాస్త్ర సాంకేతిక రంగాలలోని వారికి సన్మాన యోగం, విదేశీ యోగం. వాహనాలు కొనుగోలు యత్నాలు సాగిస్తారు.
కర్కాటకం – శుభకార్యాలకు సంబంధించిన ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. పనిగట్టుకొని ఎదుటివారి కృషిని లాగీ అందులో వేరొకరిని కూర్చోబెట్టే పైశాచిక మనస్తత్వం కలిగిన వారు మీకు ఎదురవుతారు.
సింహం – విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి.పరస్పర విరుద్ధమైన ఆలోచనలు మానసిక సంఘర్షణకు గురిచేస్తాయి. కుటుంబ సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి.
కన్య – అనుకున్నది ఒక్కటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో కొంత జాప్యం జరిగిన చివరికి పూర్తిచేస్తారు. ప్రత్యర్థి వర్గం వారికి దెబ్బతీసే అవకాశం మీరే కల్పిస్తారు.
తుల – మీ మీద ఆధారపడిన వారికోసం మీ అభిప్రాయాలను మార్చుకుంటారు. ఊరటను కలిగించే తీపి కబురు వింటారు. ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు.
వృశ్చికం – తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులను కలుస్తారు. వృత్తి- వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి.
ధనుస్సు – నూతన పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు గ్రహిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు మేలని గ్రహిస్తారు.
మకరం – బంధువుల ద్వారా శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త మిత్రుల పరిచయం ఏర్పడుతుంది. వృత్తి- ఉద్యోగ వ్యాపారాలపరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏర్పడవు.
కుంభం – మీ సన్నిహిత వర్గం మీ పరిధులకు మించి పనులను చేసి పెట్టమని పోరు పెడతారు. సమసిపోయిన సమస్యలే కొత్తకోణంలో తారసపడతాయి. స్త్రీలతో విభేదాలు ఏర్పాటు సూచనలు ఉన్నాయి.
మీనం – ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. భవిష్యత్తులో ప్రారంభించబోయే వ్యాపారాలకు గాను వనరులను సమకూర్చుకునే యత్నాలు ముమ్మరం చేయగలుగుతారు.