అమరావతి: హాస్టల్ లో నర్సు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగింది. ముదిగుబ్బ గ్రామానికి చెందిన దివ్య అనే యువతి సవేరా ఆసుపత్రిలో ఐదేళ్లుగా నర్సుగా పనిచేస్తున్నారు. నైట్ షిఫ్ట్ డ్యూటీ ముగించుకుని ఉదయం దివ్య హాస్టల్ కు వెళ్లారు. పది గంటలకు దివ్య తన తల్లికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఒంటి గంటలకు హాస్టల్ నిర్వహకులు తల్లికి ఫోన్ చేసి కూతురు చనిపోయిందని సమాచారం ఇచ్చారు. వెంటనే తల్లిదండ్రులు హాస్టల్ చేరుకొన తన కూతురు చూపించాలని అడిగారు. వాళ్లు కొంచెం సమయం అడిగారని తల్లి వాపోతున్నారు. ఆస్పత్రి యాజమాన్యమే హాస్టల్ నిర్వహిస్తున్నారని తల్లి ఆరోపణలు చేసింది. ఆసుపత్రి యాజమాన్యం వేధింపులతోనే తన కూతురు చనిపోయిందని ఆరోపణలు చేశారు. దీంతో మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు
ఆస్పత్రి యాజమాన్యం వేధింపులతో నర్సు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -