Friday, July 11, 2025

భారీ పోరాటాల చిత్రీకరణలో..

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’. (The Paradise) శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. దసరా బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం కోసం మరో`సారి చేతులు కలిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. స్పెషల్ గా వేసిన మాసీవ్ సెట్ లో ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ సూపర్‌విజన్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు.

ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రియల్ సతీష్ మాస్టర్‌తో పాటు ఫారిన్ స్టంట్ మాస్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్ గా (Highlight sequence movie) ఉండనుంది. ‘ది పారడైజ్’ గ్లోబల్ లెవెల్‌కు వెళ్లబోతోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్‌తో కలిసి 8 భాషలలో విడుదల కానుంది. మార్చి 26, 2026న ‘ది పారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News