- Advertisement -
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో కిష్టారెడ్డిపేటలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. ఔటర్ రింగ్ రోడ్డు కు సమీపంలో రెడ్లగడ్డలో విద్యార్థులను బస్సులోకి ఎక్కిస్తున్న క్రమంలో మంటలు అంటుకున్నాయి. వెంటనే విద్యార్థులను బస్సు డ్రైవర్, క్లీనర్ కిందకు దించేశారు. చూస్తుండగానే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. బస్సు పాక్షికంగా కాలిపోయిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్రాణాపాయ తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ తోనే బస్సులో మంటలు అంటుకున్నట్టు సమాచారం.
- Advertisement -