Friday, July 11, 2025

భార్య మెడపై కాలుతో తొక్కి చంపిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన భార్య మెడపై కాలుతో తొక్కి చంపేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీనివాసపూర్‌లో పద్మజ-హరీష్ కుమార్ అనే దంపతులు నివసిస్తున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తుండగా భార్య ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తోంది. హరీష్ గత కొన్ని నెలల నుంచి జాబ్ మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. షాపింగ్‌కు వెళ్లొచ్చిన భార్యతో భర్త గొడవకు దిగాడు. దంపతులు మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో భార్య గొంతునులిమిన నెట్టేశాడు. ఆమె కిందపడిన వెంటనే మెడపై కాలుతో తొక్కడంతో ఊపిరాడక భార్య ఘటనా స్థలంలోనే చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News