- Advertisement -
నల్లగొండ: కోడి కాళ్లు విరగొట్టాడని పక్కింటి వ్యక్తిపై పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గొల్లగూడెంలో గంగమ్మ అనే మహిళ తన ఇంట్లో కోడిని పెంచుకుంటుంది. కోడి పక్కింట్లోకి వెళ్లి ధాన్యాలు తినడంతో కోడిని రమేష్ అనే వ్యక్తి కర్రతో కొట్టడంతో దాని కాళ్లు విరిగాయి. సదరు మహిళ గాయపడిన కోడిని తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా డిమాండ్ చేస్తుంది. కోడి పంచాయతీ ఎలా పరిష్కరించాల్లో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకున్నారు. గంగమ్మకు నచ్చజెప్పి పోలీసులు ఇంటికి పంపించారు. కోడికి వైద్యం చేయించుకోవాలని ఆమెకు పోలీసులు సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Advertisement -