Friday, July 11, 2025

శుక్రవారం రాశి ఫలాలు (11-07-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – కీలకమైన పత్రాల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

వృషభం – జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి.ఆరోగ్యం నలతగా ఉంటుంది. మీరు ఎంత సర్దుకుపోయిన వివాదాస్పద వ్యక్తిగానే మీపై ముద్ర పడుతుంది.

మిథునం – కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు అంతగా లాభించవు.ఉపకరించే మిత్ర వర్గం వలన మానసిక ఊరటను కలిగి ఉంటారు. మేధస్సును దృష్టిని స్థిరంగా కేంద్రీకరించండి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి.

కర్కాటకం – ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుంటారు ఆ లక్ష్యాలకు కట్టుబడి పని చేస్తారు. కాలాన్ని వృధా చేయకూడదని నిర్ణయించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాల్సిన తరుణం.

సింహం – మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయ సిద్ధి గోచరిస్తుంది. ఒక శుభవార్త మీకు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

కన్య – తోటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి- ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి.

తుల – అధైర్య పడకుండా ముందుకు సాగినట్లయితే మేలైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పట్టు వదలకుండా పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం – అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి సరైన సమయం అని గ్రహిస్తారు.

ధనుస్సు – ప్రారంభించిన పనులలో పురోగతి లభిస్తుంది. మానసిక సంతోషం కలిగి ఉంటారు. బంధువులతో మాట పట్టింపులు వచ్చే సూచనలున్నాయి. కీర్తి వృద్ధి చెందుతుంది. కార్యజయం లభిస్తుంది.

మకరం – శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మీరంటే గిట్టని వారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లే స్థితి గోచరిస్తుంది.

కుంభం – మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి మంచి జరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.

మీనం – ప్రారంభించబోయే పనులకు ఆటంకం కలగకుండా చూసుకుంటారు. వృత్తి- ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రశాంతమైన ఆలోచనలతో రోజు గడుస్తుంది.

Rasi phalalu cheppandi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News