- Advertisement -
మన తెలంగాణ/మల్దకల్: కలియుగ ప్రత్యక్ష దైవం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీనివాసుని కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అయిజ పట్టణానికి చెందిన నవీన్ పర్ణిక దంపతులు కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు దేవాలయం తరుపున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్వారి అరవిందరావు, చంద్రశేఖరరావు, అర్చకులు మధుసూదన చారి, రవి, వాల్మీకి పూజారులు పాల్గొన్నారు.
పోటో :10 ఎంబిఎన్‌ఆర్ 3
- Advertisement -