- Advertisement -
టీమిండియా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. లార్డ్‌లోని చారిత్రక మ్యూజియంలో సచిన్ చిత్రపటం ఏర్పాటు చేశారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం లార్డ్ వేదికగా మూడో టెస్టు ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను సచిన్ గంటను మోగించి ప్రారంభించాడు. ఇక ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న సచిన్‌కు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అరుదైన రీతిలో సత్కరించింది. అతని చిత్రపటాన్ని లార్డ్ మ్యూజియంలో ఏర్పాటు చేసింది. దీన్ని సచిన్ స్వయంగా ఆవిష్కరించాడు. దీన్ని తన జీవితంలోనే అరుదైన గౌరవంగా సచిన్ పేర్కొన్నాడు.
- Advertisement -