భారత్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఆచితూచి ఆడుతోంది. దీంతో మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్ జట్టు 83 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. భారత పేసర్ నితీశ్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్ లో ఓపెనర్లు జాక్ క్రాలీ(18), డకెట్ (23)లను ఔట్ చేశాడు.
ఆ తర్వాత బుమ్రా, జడేజాలు చెరో వికెట్ తీయడంతో ఇంగ్లాండ్ జట్టు ఒత్తిడిలో పడింది. ఈ క్రమంలో కెప్టెన్ బెన్ స్టోక్ తో కలిసి జో రూట్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఇద్దరు నిదానంగా ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో అర్థశతకం పూర్తి చేసుకున్న రూట్.. సెంచరీకి ఒక పరుగు దూరంలో ఉన్నాడు. మరో ఎండ్ లో స్టోక్(39 నాటౌట్) వికెట్ కాపడుకుంటూ రూట్(99 నాటౌట్)కు సహకారమందించాడు. మరో వికెట్ కోల్పోకుండా తొలి రోజు ఆట ముగించారు.