Friday, July 11, 2025

సర్కార్ బడిబాట సక్సెస్

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ప్రవేశాల సంఖ్య
1వ తరగతిలో కొత్తగా 1.38లక్షల మంది
విద్యార్థుల చేరిక వివిధ తరగతుల్లో మొత్తం
3.68లక్షల మంది ప్రవేశం ప్రైవేట్ స్కూళ్ల
నుంచి సర్కార్ బడులకు మళ్లిన 79వేల
మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం,
డిజిటల్ బోధనతో ఆకట్టుకుంటున్న బడులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం సత్ఫతలానిచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యపెరిగిం ది. 1వ తరగతిలో 1,38,135 మంది విద్యార్థు లు ప్రవేశాలు పొందారు. ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు విద్యాశాఖ నిర్వహించిన ఆచార్య జ యశంకర్ బడిబాట కార్యక్రమం ముగిసింది. ఈసారి వివిధ తరగతుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 3,68,054 మంది విద్యార్థులు ప్రవేశా లు పొంచారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన, మౌలిక వసతులు క ల్పించడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. నర్సరీ నుంచి పదో తరగతి వరకు ప్రైవేటులో చ దివించిన తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో ఫ లితాలు రావడంలేదని, ఫీజుల భారం పెరగడం తో కొందరు సర్కారు బడిలో చేర్పిస్తున్నారు.

ఈ సారి 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 79,048 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందిన ట్లు అధికారులు తెలిపారు. సర్కారు బడిలో ఒక టో తరగతి నుంచి ప్రవేశాలు కల్పించినా మంచి ఫలితాలు సాధిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రు లు పేర్కొంటున్నారు. పదో తరగతిలో ప్రైవేటు విద్యార్థుల కంటే మెరుగ్గా ఫలితాలు సాధిస్తున్నారు. ప్రభు త్వ బడిలో చదివిస్తే ఎలాంటి ఫీజు చెల్లించాల్సి అవసరం ఉండదు.ఉచితంగా యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, వా రానికి మూడు గుడ్లు అందిస్తున్నారు. ఇప్పటివరకు 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్ర భు త్వ పాఠశాలల్లో మొత్తం 2,29,919 మంది వి ద్యార్థులు ప్రవేశాలు పొందగా, అందులో ప్రైవే ట్ నుంచి 79,048 మంది, ప్రభుత్వ బడి నుంచి ప్రభుత్వ బడికి 1,50,819 మంది ప్రవేశాలు పొందినట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News