Friday, July 11, 2025

రంగంలోకి ఇడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో ఇడి రంగంలోకి దిగింది. బెట్టిం గ్ యాప్స్ ప్రమోషన్లకు పాల్పడిన సినిమా, టీవీ సెలబ్రిటీలపై ఇడి చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు 29 మంది సెలబ్రిటీలతో పాటు వారు ప్ర మోట్ చేసిన కంపెనీలపై కేసులు నమోదు చేసిం ది. వీరిలో సినీ నటులు విజయ్ దేవరకొండ, రా నా, మంచు లక్ష్మి, ప్రకాశ్‌రాజ్ , నిధి అగర్వాల్ , అనన్య నాగళ్ల, శ్రీముఖితో పాటు పలువురిపై సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇడి వి చారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూ ట్యూ బర్స్ , ఇన్ ఫ్లూయెన్సర్లను మనీ ల్యాడరింగ్ నేరం కింద విచారించనుంది. ఈ సెలబ్రిటీలు భారీ మొ త్తంలో పారితోషికాలు తీసుకుని, నిషేధిత బెట్టిం గ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారన్నది ఆ రోపణ.

వీరి ప్రచారం కారణంగా ఎంతోమంది యువత ఈ యాప్‌ల బారిన పడి, ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారని పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో యాం కర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతుతో పాటు పలువురు బుల్లితెర నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లను కూడా చేర్చారు. తెలంగాణ గేమింగ్ చ ట్టం, ఐటి చట్టంలోని వివిధ సెక్షన్ల కింద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా, ఇప్పుడు ఇడి దర్యాప్తుతో ఈ కేసు మరింత తీవ్రరూపం దా ల్చింది. త్వరలోనే వీరందరినీ విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి నెలలో బె ట్టింగ్ యాప్స్ వ్యవహారం వెలుగు చూసిన విష యం తెలిసిందే. ఈ ఉదంతంలో సినీ ప్రముఖు లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సహా మొ త్తం 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశా రు. వీరిపై హైదరాబాద్ మియాపూర్ వాసి ప్రమో ద్ శర్మ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసారు.

అయితే ఈ వ్యవహారంలో మనీలాండరిం గ్ జరిగినట్లు ఇడి అధికారులు గుర్తించారు. పోలీసుల ఎఫ్‌ఐఆర్ నమోదు ఆధారంగా తాజాగా ఇడి విచారణ కొనసాగనున్నది. ఇడి కేసులు నమోదు చేసిన 29 మందిలో రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రా జ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత సు భాశ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసం తి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, శ్యామల, తేజ, రీతూ చౌదరి, బందరు శేషాయని సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్, లోకల్ బాయ్ నాని ఉన్నారు. వీరిపై ఇది వరకే సైబరాబాద్ పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్‌లు 318(4), 112, 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్‌లు 3, 3(ఎ), 4, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్ సెక్షన్ 66(డి) కింద నమోదు చేశారు.

ఈ యాప్స్ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867ను ఉల్లంఘిస్తున్నాయని, ఆర్థిక నష్టాలతో పాటు సామాజిక హాని కలిగిస్తున్నాయని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈడీ ఈ కేసును ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పిఎంఎల్‌ఎ) కింద దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రచారాల ద్వారా భారీ మొత్తంలో డబ్బు చలామణీ, మనీ లాండరింగ్ జరిగి ఉండవచ్చని ఇడి అనుమానిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News