Friday, July 11, 2025

ఎమ్మెల్యే జిఎంఆర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

మండల పార్టీ అధ్యక్షులు జెట్టి నర్సింహా రెడ్డి పై నిప్పులు
దేవరకద్ర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజల్ రెడ్డి
మన తెలంగాణ/ దేవరకద్ర ః దేవరకద్ర నియోజకవర్గంలో కేవలం 18 నెలల్లోనే 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులను సాధించి ముందుకు సాగుతున్న దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జెట్టి నరసింహా రెడ్డికి అభివృద్ధి కనిపించడం లేదా అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంజన్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం దేవరకద్ర మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేవరకద్ర మండలంలో పలు అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే జిఎంఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు.

ఇప్పటికే దేవరకద్ర నియోజకవర్గంలో 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు సాధించిన ఘనత ఒక్క దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పది సంవత్సరాలలో ఏ ఊరిలో ప్రభుత్వ పనులు ఇసుక అనుమతి తీసుకుని పనులు చేస్తుంటే ఆ గ్రామాల నాయకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులు చేసిన దద్దమ్మవు నీవు నీతులు మాట్లాడుతున్నావా అని హెచ్చరించారు. బిఆర్‌ఎస్ హయాంలో దేవరకద్ర పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తానని గొప్పలు చెప్పారు మరేమైందని ప్రశ్నించారు. అభివృద్ధిని చూసి సహనం కోల్పోయి కామెంట్లు పెడుతున్నారు, రేపు జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల అధ్యక్షులు అంజల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్, హన్మంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గోవర్ధన్ యాదవ్, ఎస్‌సి మండల అధ్యక్షులు రాము, ఎస్‌సి పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు, మండల ఓబిసి అధ్యక్షులు గోపాల్, సీనియర్ నాయకులు రామ్ పాండు, రఘువర్మ, సిఎం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News