మన తెలంగాణ/కరీంనగర్ లీగల్: మైనర్ బాలికపై హత్యాచారం చేసిన కేసులో నిందితుడైన అక్కినపల్లి వంశీధర్‌పై నేరం రుజువు కావడంతో కరీంనగర్ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డి వెంకటేష్ పదేండ్ల జైలుశిక్షతో పాటు ఆరు వేల రూపాయల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వన్‌టౌన్ పరిధిలో పెంట కల్పన కూలీ పని చేసుకుంటూ తన ఇద్దరి కూతుర్లను చదివిస్తున్నారు. జూన్ 29, 2020న 9వ తరగతి చదువుతున్న తన రెండవ కూతురు కనిపించడం లేదని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కొన్ని రోజుల తర్వాత కూతురు బస్‌స్టేషన్ నుండి ఫోన్ చేయగా కల్పన ఇంటికి తీసుకొని విషయం ఆరా తీయగా నన్ను రేకుర్తి చెందిన అక్కినపల్లి వంశీధర్ ఆటో డైవర్ పరిచయం అయ్యాడని మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాళ్ల ఇంటికి తీసుకొని వెళ్లి అత్యాచారం చేశాడని, పెళ్లి చేసుకోవాలని అడుగగా తనకు ఇంతకు ముందే పెళ్లి అయిందని బెదిరించి కరీంనగర్ బస్‌స్టేషన్‌లో వదిలి వెళ్లాడని చెప్పగా, వంశీధర్‌పై వన్‌టౌన్‌లో కల్పన ఫిర్యాదుచేసింది. సీఐ విజయ్‌కుమార్ కేసు విచారణ చేసి కోర్టులో ఛార్జ్ షీట్ చేశారు. ప్రాసిక్యూషన్ తరుపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పంజాల కుమారస్వామి విచారించగా సాక్షాదారులను పరిశీలించిన నిందితుడైన అక్కినపల్లి వంశీధర్‌పై నేరం రుజువు కావటంతో పదేండ్ల జైలుశిక్ష విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు న్యాయమూర్తి వెంకటేష్ తీర్పు చెప్పారు.