Friday, July 11, 2025

పోలీస్ శాఖలో లేడి సింగంలు.. 4 ఠాణాలకు ఎస్సైలుగా నారీమణులే

- Advertisement -
- Advertisement -

సరికొత్త అధ్యయానానికి కొత్వాల్ శ్రీకారం
శాంతి భద్రతల నిర్వహణలో సత్తాకు అవకాశం
మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో ః అరకొరగా ఉండే మహిళా అధికారులుగా అనామకులకుగా చెలామణి అయ్యే పోలీస్ శాఖలో ఇప్పుడు నారీమణులు శకం మొదలయ్యింది. నిజమే జిల్లా పోలీసు శాఖలో లేడి సింగంలు కార్యక్షేత్రంలోకి దిగారు. శాంతి భద్రతల నిర్వహణలో తమదైన ముద్ర వేసుకోవడానికి అరుదైన అవకాశం దక్కింది. అవనిలో ఆకాశంలోనే కాదు పోలీసు శాఖలోను సగం కాబోతున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా నాలుగు అత్యంత కీలకమైన పోలీస్ స్టేషన్‌లకు ఎస్సైలుగా నియామకం అయ్యారు. ఇటీవల శిక్ష పూర్తి చేసిన నలుగురు మహిళా ఎస్సైలకు మొదటి పోస్టింగ్‌లోనే శాంతి భద్రత నిర్వహణలో క్లిష్టంగా ఉండే స్టేషన్‌లను అప్పగించారు. అదికూడా సీనియర్ ఎస్సైలను తప్పించి మరీ ! పోలీస్ శాఖలో మహిళా అధికారులుంటారు. జీతాలు…పదోన్నతులు, మగ అధికారులతో సమానంగానే ఉంటాయి. కానీ పోస్టింగ్‌లో కనీస ప్రాధాన్యత ఉండదు. చాలా కాలంగా ఈవివక్ష కొనసాగుతుంది. అనేక సవాళ్లు ప్రతికూల పరిస్థితులుండే శాంతి భద్రతల నిర్వహణలో మహిళా అధికారులను ముందుంచడానికి ఉన్నతాధికారులు వెనుకాడుతారు. కానీ జిల్లాకు కొత్తగా వచ్చినకొత్వాల్.. పోలీస్ శాఖకు నారీ శక్తిని జోడించి వినూత్న ప్రయోగం చేశారు.

ఇటీవలే శిక్షణ పూర్తి చేసిన మహిళా ఎస్సైలకు కీలకమైన పోస్టింగ్‌లు ఇచ్చారు. ఏకంగా నాలుగు కీలకమైన ఠాణాలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా నియామకం చేశారు. సీనియర్ ఎస్సైలు ఎంతో మంది అందుబాటులో ఉన్న సరే చట్టాల మీద ఇప్పుడే అవగాహన తెచ్చుకున్న యువ ఎస్సైలను బాధ్యతలు ఇవ్వడం పోలీస్ శాఖలో చర్చనీయాంశం అయింది. గతంలోనూ జిల్లాకు అనేక మంది లేడి ఎస్సైలు వచ్చినా ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చేది. మహిళా స్టేషన్ సఖీ కేంద్రాలకే పరిమితం అయ్యేది. ఈసారి ఏకంగా నాలుగు స్టేషన్‌లకు ఎస్సైలుగా నియామకం చేశారు. అదికూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలున్న సెగ్మెంట్‌లలో ! శిక్షణ పూర్తి చేసిన అధికారులకు నేరుగా స్టేషన్‌లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది.

కొత్త అధికారులకు అనుభవం రావడానికి ఇది అనివార్యంగా భావించే వారు.. రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి సీనియర్లు తప్పించి పోస్టింగ్‌లు ఇవ్వడం పోలీస్ బాస్‌లకు కత్తిమీద సాముగా ఉంటుంది. ఈనేపథ్యంలో కమిషనర్ సాయి చైతన్య శిక్షణ పూర్తి చేసిన ఎస్సైలకు పోస్టింగ్‌లు ఇవ్వడానికి ఇవేవి పట్టించుకోలేదు. పైగా కొత్త ఆనవాయితీకి తెరలేపారు. శిక్షణ పూర్తి చేసిన అధికారులలో మహిళా అధికారులందరూ లా అండ్ ఆర్డర్‌లో సత్తా చాటేలా వారికి జిల్లాలో ఏకంగా నాలుగు ఠాణాలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా నియామకం చేశారు. అదికూడా కీలకమైన ఠాణాలు కావడం గమనార్హం. ఇందులో మామిడిపల్లి కళ్యాణికి అత్యంత మారుమూల ప్రాబల్యం ప్రాంతం అయినా సిరికొండ ఎస్సైగా నియమించారు. మళ్ళీ ఆమెకు ధర్పల్లి స్టేషన్‌కు మార్చారు. గతంలో ఈప్రాంతం అత్యంత నక్సల్స్ ప్రాబల్యం ప్రాంతంగా ఉండేది.

లా అండ్ ఆర్డర్ పరంగా సున్నితమైన ప్రాంతంగా ఉన్న ఎడపల్లికి ఎస్సైగా ముత్యాల రమాను గిరిజన నివాసులు ఎక్కువగా ఉన్న మోపాల్ ఎస్సైగా సుస్మితను, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పరిధిలోకి వచ్చే మెండోరా ఎస్సైగా జాదవ్ సుహాసినిలు నియామకం అయ్యారు. ఈసారి బదిలీల్లో కమిషనర్ అధికార పార్టీ నుంచి ఎలాంటి సిఫార్స్‌లను పట్టించుకోలేదు. ఎస్సైల బదిలీ ప్రక్రియ మొదలవ్వగానే అధికార పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షణలు చేస్తారు. ఉన్నతాధికారుల సంగతి ఎలా అధికార పార్టీ నేత ఆమోదం అనివార్యంగా భావిస్తారు. అందుకే పోలీసు బాస్‌లు ఇలాంటి ఒత్తిళ్లను అధిగమించి తమ ఇష్టానుసరం పోస్టింగ్‌లు ఇవ్వడం దుసాధ్యంగా మారుతుంది. కానీ కొత్వాల్ కొత్త అధికారులకు స్టేషన్‌లు ఇవ్వడం గట్టిగా నిలబడ్డారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలు సొంత నియోజక వర్గాల్లోను మహిళా ఎస్సైలు నియామకం కావడంతో నియామకాల్లో కమిషనర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News