- Advertisement -
బెంగళూరు: గంజాయి మత్తులో పక్కింటి బాలికపై ఓ యువకుడు ఆత్యాచారం చేసి చంపేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు శివారులో తావరెకెరెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోప్పళ్ల ప్రాంతానికి చెందిన దంపతులు జీవనోపాధి నిమిత్తం తావరెకెరెకు వచ్చారు. ఆ దంపతుకు 14 ఏళ్ల కూతురు ఉంది.
ఆమె ఆరో తరగతి చదువుతుండగా బడి మానేసి ఇంట్లోను ఉంటుంది. ఓ యువకుడు గంజాయి తాగి బాలికపై అత్యాచారం చేసి అనంతరం తలపై సిలిండర్ కొట్టి ఆమెను చంపేశాడు. తల్లిదండ్రుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాయచూరుకు చెందిన నిందితుడు మొదటి నుంచి బాలిక తల్లిదండ్రులతో పరిచయం ఉంది. సిలిండర్లు దొంగలించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించేవారని తేలింది.
- Advertisement -