Saturday, July 12, 2025

నా సక్సెస్ వెనుక ఆ ఇద్దరు ఉన్నారు: నితీశ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

లార్డ్స్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు 83 ఓవర్లలలో నాలుగు వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జోయ్ రూట్(99), బెన్‌స్టోక్స్(39) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్ నితీశ్ కుమార్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తన సక్సెస్ వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలిపాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఉన్నారని తెలియజేశాడు.

ఇద్దరు ఇచ్చిన సూచనలతోనే రెండు వికెట్లు తీశానని చెప్పుకొచ్చారు. వాతావరణ పరిస్థితులను గమనించి బౌలింగ్ చేయాలని పాట్ కమిన్స్ సూచించారని తెలిపారు. బౌలింగ్ చేసేటప్పుడు వీలైనంత వరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్నారు. బౌలింగ్ కోచ్ మోర్కెల్‌తో కలిసి పని చేయడంతో అద్భుతాలు సృష్టించొచ్చని పేర్కొన్నారు. మోర్కెల్‌తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. గత రెండు సంవత్సరాల నుంచి బౌలింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టడంతో పాటు కఠోర సాధన చేస్తున్నానని, రెండు వైపులా బంతి స్వింగ్ చేయడంతో పాటు సరైన ప్రదేశంలో సంధించడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News