Friday, July 11, 2025

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాయశయంలోకి భారీగా వరద నీటి ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లను తెరచి.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 1,48,696 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 1,48, 734 క్యూసెక్కులుగా ఉంది. ఇక, జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 882.80 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అలాగే, తుంగభద్ర డ్యామ్ కు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు డ్యామ్ 12 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ లోకి ఇన్ ఫ్లో 40,082 క్యూసెక్కులుగా.. అవుట్ ఫ్లో 40,657 క్యూ సెక్కులుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News