బెంగళూరు: ప్రేమజంట తుంగభద్ర ఎడమ కాలువలో దూకి గల్లంతయ్యారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం మునిరాబాద్ డ్యామ్ చైన్ 28 వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నింగాపుర గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే యువకుడు, సణాపుర గ్రామానికి చెందిన అంజలి అనే యువతి గాఢంగా ప్రేమించుకున్నారు. అంజలి కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి అడ్డుచెప్పారు. ఈ ప్రేమజంట పారిపోయి హగరిబొమ్మనహళ్లిలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. యువతి కుటుంబ సభ్యులు తెలుసుకొని హగరిబొమ్మనహళ్లికి వెళ్లారు. ఇద్దరిని కారులో తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అందరు కారులో వస్తుండగా మునిరాబాద్ డ్యామ్ వద్ద వాహనం ఆపి మూత్ర విసర్జన చేస్తున్నారు. ప్రేమ జంట డ్యామ్ పైనుంచి తుంగభద్ర ఎడమకాలువలో దూకారు. యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మునిరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బలవంతంగా తీసుకెళ్తుండగా తుంగభద్ర కాలువలో దూకిన ప్రేమజంట
- Advertisement -
- Advertisement -
- Advertisement -