Friday, July 11, 2025

దారుణం.. బస్సు నుండి దింపి 9మంది ప్రయాణికులను కాల్చి చంపారు

- Advertisement -
- Advertisement -

బస్సులో ప్రయాణిస్తున్న వారిలో తొమ్మిది మందిని కిందకు దించి దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని అల్లకల్లోల బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ప్రావిన్స్‌లోని జోబ్ ప్రాంతంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ప్రయాణీకుల బస్సు నుండి పంజాబ్‌కు చెందిన తొమ్మిది మంది ప్రయాణికులను దింపి.. తిరుగుబాటుదారులు కాల్చి చంపారని అసిస్టెంట్ కమిషనర్ జోబ్ నవీద్ ఆలం తెలిపారు. “క్వెట్టా నుండి లాహోర్‌కు వెళ్తున్న బస్సును ఆపి ప్రయాణికుల ఐడి కార్డులను తనిఖీ చేసి.. వారిలో తొమ్మిది మందిని కిందకు దింపి కాల్చి చంపారు. మృతులు పంజాబ్ ప్రావిన్స్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తింపు. తొమ్మిది మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు” అని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News