Saturday, July 12, 2025

జో రూట్ అరుదైన రికార్డు.. సచిన్ సరసన చోటు

- Advertisement -
- Advertisement -

ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జో రూట్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా ఇంగ్లాండ్-భారత్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో రూట్ ఈ ఘనత సాధించాడు. మొదటి రోజు టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఒకే ఓవర్ లో ఓపెనర్లను ఔట్ చేసి నితీశ్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్ కు షాకిచ్చాడు. ఆ తర్వాత మరో రెండు కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తడిలో పడిన ఇంగ్లాండ జట్టును జోరూట్ ఆదుకున్నాడు. కెప్టెన్ బెన్ స్టోక్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. అసాధారణ బ్యాటింగ్ తో రాణించిన జో రూట్… మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీకి ఒక పరుగు దూరంలో ఉన్నాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో రూట్ చరిత్ర సృష్టించాడు. 34 ఏళ్ల రూట్ స్వదేశంలో 7000 పరుగులు పూర్తి చేసిన ఐదవ ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, మహేల జయవర్ధనే, జాక్వెస్ కల్లిస్ వంటి దిగ్గజ ఆటగాళ్ల సరసన రూట్ చేరాడు.

కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 83 ఓవర్లలో 4 కీలక వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రూట్(99), బెన్ స్టోక్(39)లు ఉన్నారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారెు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News