గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బిగ్ షాకిచ్చాడు. శుక్రవారం రాజాసింగ్ రాజీనామాను ఆయన ఆమోదించారు. దీంతో బిజెపితో రాజాసింగ్ కు ఉన్న అనుబంధం తెగిపోయినట్లే. ఇటీవల అధిష్టానం తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమించిన సంగతి తెలిసిందే. మొన్నటివరకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి స్థానంలో ఆ పార్టీ సినీయర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావుకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు.
గత 10 రోజులుగా పెండింగ్ లో ఉంచిన రాజాసింగ్ రాజీనామాను ఇవాళ జెపి నడ్డా ఆమోదించారు. కాగా, రాజీనామా తర్వాత సైలెంట్ అయిన రాజాసింగ్.. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారోనని ఆసక్తి నెలకొంది. అయితే, రాజీనామా అనంతరం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను కలిసి రాజాసింగ్.. ఆ పార్టీలోకే వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.