మేషం – మీ సమర్థతను పెంచుకోగలుగుతారు.కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు. శుభ ఫలితాలు అందుకుంటారు.
వృషభం – మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలు పొందగలుగుతారు. మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మిథునం – శ్రమ అధికంగా ఉంటుంది ఫలితాలు మీరు ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతవరకు మెరుగ్గానే ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సహోదర వర్గం యొక్క యోగక్షేమాలను విచారిస్తారు.
కర్కాటకం – సుదూర ప్రాంత ప్రయాణాలకు అనువైన సమయం కాదు. మిత్రులతో శుభకార్యాల విషయమైనా చర్చలు సాగిస్తారు. పార్ట్ టైం జాబ్ వర్కులు లాభిస్తాయి. కాంట్రాక్టులకు స్వల్పమైన లాభాలు చేకూరుతాయి.
సింహం – కోర్టు వ్యవహారాలు వివాదాస్పదమైనటువంటి అంశాలు సానుకూల దిశగా ఉంటాయి. అకౌంట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనబరిచి లాభపడగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు చేస్తారు.
కన్య – నిరాశా నిస్పృహలకు ఏమాత్రం తావివ్వరు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక స్థితిగతులు సమతుల్యంగా ఉంటాయి.
తుల – బంధువర్గంతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా అధిక శ్రద్ధను కనబరుస్తారు. అనుకూలమైన అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని లాభపడతారు.
వృశ్చికం – చిన్నచిన్న ప్రయోజనాలతో సంతృప్తిని వ్యక్తం చేయరు. ఆరోగ్యం వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరించే ఆలోచనలు చేస్తారు.
ధనుస్సు – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతనమైన ఫైనాన్షియల్ స్కీమ్స్ లో సభ్యత్వం తీసుకుంటారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
మకరం – విజయాలు కార్యరూపంలో కనిపించిన అసహనంగా ఉంటారు. సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
కుంభం – కుటుంబంలో భేదాభిప్రాయాలు చోటు చేసుకునే సూచనలున్నాయి జాగ్రత్త వహించడం మంచిది. గతంలో పాటించిన పొదుపు పథకాలు అక్కరకొస్తాయి. ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది.
మీనం – మధ్యవర్తి ద్వారా శుభకార్య ప్రయత్నాలలో ముందడుగు వేయగలుగుతారు. వృత్తిపరంగా కనబరిచే ఓర్పు మంచి ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.