2010లో రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మర్యాద రామన్న’. ఈ సినిమాను హిందీలో ‘సన్ ఆఫ్ సర్దార్’ పేరుతో రీమేక్ చేశారు. అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాలో హీరో. 2012లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ‘సన్ ఆఫ్ సర్దార్-2’ (Son Of Sardaar 2) త్వరలో రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
తొలి భాగం పంజాబ్‌లో జరగగా.. రెండో భాగం స్కాట్‌లాండ్‌లో జరుగుతుందని ట్రైలర్ చూస్తే మనకి అర్థం అవుతోంది. మొదటి భాగంలో సొనాక్షి సిన్హా హీరోయిన్ కాగా, ఈ సినిమాలో (Son Of Sardaar 2) ట్రెండింగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, అజయ్ దేవ్‌గన్ సరసన నటిస్తోంది. ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులతో నవ్వులు పూయిస్తోంది. స్కాట్‌లాండ్‌లో హీరోయిన్ కుటుంబానికి సహాయం చేసేందుకు వెళ్లిన హీరో ఎదురుకొనే సమస్యల గురించి ఈ స్టోరీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
జియో స్టూడియోస్, దేవ్‌గన్ ఫిలిమ్ బ్యానర్ల సమర్పణలో ఈ చిత్రాన్ని అజయ్ దేవ్‌గన్, జ్యోతి దేశ్‌పాండే, ఎన్ఆర్ పాచిసియా, ప్రవీణ్ తల్రేజా నిర్మిస్తున్నారు. విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జూలై 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.