Saturday, July 12, 2025

హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు: పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

రాజభాషా స్వర్ణోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని అన్నారు. హిందీని ప్రేమించాలని, దానిని స్వీకరించాలని, దానిని ప్రోత్సహించేందుకు మనందరం కలిసి సంకల్పించుకుందామని పిలుపునిచ్చారు. హిందీని వ్యతిరేకించడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. మనం విదేశీ భాషలను నేర్చుకోగలిగితే, హిందీ గురించి ఎందుకు వెనుకాడాలని ప్రశ్నించారు. దక్షిణాది సినిమాలు 31 శాతం హిందీలో డబ్బింగ్ చేసిన విడుదల చేయడం వల్ల

ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హిందీని సులభంగా అర్థం చేసుకోవచ్చునని అన్నారు. తాను వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో హిందీని ఉపయోగిస్తానని తెలిపారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాంను గుర్తుచేసుకుంటూ భాష హృదయాలను అనుసంధానించాలని అన్నారు. ఈ దృక్కోణం నుండి హిందీని చూద్దామని కలాం అన్న మాటలను పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సంస్థల నుండి పలు హిందీ ప్రచురణలను ఆవిష్కరించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, ప్రొఫెసర్ మాణిక్యాంబ, ప్రొఫెసర్ అనంత్ కృష్ణన్ తదితరులు ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News