Saturday, July 12, 2025

9 నెలల క్రితం చనిపోయిన పాక్ నటి హుమైరా..ఇప్పుడు వెలుగుచూసిన మృతదేహం

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ నటి, మోడల్ హూమైరా అస్గర్ అలీ 9 నెలల క్రితం అంటే 2024 అక్టోబర్ లో మరణించిందని పోలీసులు భావిస్తున్నారు. చాలా కాలంగా ఆమె జాడ తెలియలేదు. కరాచీ లోని ఉన్నత స్థాయి ఇత్తెహాద్ కమర్షియల్ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని ఇప్పుడు కనుగొన్నారు. కుళ్లిపోయిన హుమైరా మృతదేహాన్ని దీంతో మిస్టరీ వీడింది. ఇప్పుడు పోరెన్సిక్
నిపుణులు, పరిశోధకులు రంగంలోకి దిగి డిజిటల్ పాదముద్ర ఆధారంగా ఆమె మరణానికి దారితీసిన సంఘటనలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.హుమైరా అద్దెకు ఉంటున్న ప్లాట్ లోకి కోర్టు బెయిలిఫ్ ఒకరు వెళ్లి, ఆ ఇంటి తలుపులు
తెరవాలన్న ఉత్తర్వులు అమలు చేసిన తర్వాత ఆమె అవశేషాలు కన్పించాయి. దాదాపు 9 నెలల పాటు చనిపోయిన ఆమెను ఎలా గుర్తించలేక పోయారో ఓ పెద్ద మిస్టరీ.

ఈ మొత్తం ఉదంతంపై దర్యాప్తు జరుగుతోంది. హుమైరా మరణం నెల క్రితమే జరిగిందని ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదికలు పేర్కొన్నాయి.కానీ ఆమె డిజిటల్ పాదముద్రలు మరో కథను చెప్పాయి. ఆమె కాల్ డిటైల్ రికార్డ్ ప్రకారం చివరి కాల్ 2024 అక్టోబర్ లో జరిగిందని పోలీసు డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ సయ్యద్ అసద్ రజా వివరించారు. ఫేస్ బుక్ లో ఆమె చివరిగా 2024 సెప్టెంబర్ 11న పోస్ట్ చేశారు.ఇన్ స్టాగ్రామ్ అప్ డేట్ సెప్టెంబర్ 30గా ఉంది.సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత ఆమెను తాము ఎవరమూ చూడలేదని ఇరుగు పొరుగు వారు తెలిపారు.ఆమె మరణానికి కారణం ఏమిటో ఇంకా నిర్థారణ కాలేదు. ఆత్మహత్యా, లేక ప్రమాదామా లేక ఎవరైనా నేరానికి పాల్పడ్డారా అన్న కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. ఫోరెన్సిక్ ప్రక్రియ కొనసాగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News