గోవా యూనివర్సిటీలో జరిగిన సాంసృ్కతిక కార్యక్రమంలో మగవిద్యార్థులు కేవలం లోదుస్తులు ధరించి ఊరేగడంపై గోవా మానవ హక్కుల కమిషన్ వైస్ ఛాన్సిలర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గురువారం కమిషన్ వైస్ – చాన్సలర్ హరిలాల్ బి మీనన్ కు నోటీసు జారీ చేసింది.జూలై 23 లోగా తమ ముందు హాజరై సమాధానం సమర్పించాలని కోరింది. ఫిబ్రవరిలో జరిగిన ప్రోలిక్ అనే ఇంటర్- డిపార్ట్ మెంటన్ ఫెస్టివల్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని యూనివర్సిటీకి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. థర్డ్ డిగ్రీ అనే అంశం సందర్భంగా
జ్యూరీ పాల్గొనేవారిని లో దుస్తులవరకూ విప్పివేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.
ఈ వారం ఓ దినపత్రికలో వచ్చిన రిపోర్ట్ ను హక్కుల కమిషన్ సూమోటోగా విచారణకు స్వీకరించింది. ఇది విద్యార్థుల మానవహక్కుల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని కమిషన్ అభిప్రాయ పడింది. ఈ సంఘటననుఎన్ఎస్ యుఐ నాయకుడు నౌషాద్ చౌదరి ఖండించారు. ఈ ఉత్సవానికి మహిళా విద్యార్థులు కూడా హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.
ఆ సమయంలో విద్యార్థులను బయటకు వెళ్లడానికి అనుమతించలేదని, దీంతో పురుష విద్యార్థులు మహిళా విద్యార్థినులు ఇబ్బంది పడ్డారని ఆయన తెలిపారు. ఎన్ యుఎస్ఐ ఈ ఘటనపై నిరసనలు ప్లాన్ చేస్తోంది.