మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా ఇతర వృత్తి విద్యా కో ర్సులకు ఈ ఏడాది పాత ఫీజులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలలో ఈ ఏ డాదే ఫీజులు సవరించే అవకాశం కనిపిస్తోంది. ఫీజులు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని పలు ఇంజనీరింగ్ కాలేజీ లు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యా యస్థానం కొట్టివేసింది. ఫీజుల పెంపు కో సం ఇచ్చిన వినతులపై తెలంగాణ అడ్మిష న్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టిఎఎఫ్‌ఆర్‌సి) ఆరు వారాల్లో నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని హైకోర్టు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని ఉన్నత న్యాయస్థా నం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హై కోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ ఏడాది పాత ఫీజుల ను కొనసాగించాలని నిర్ణయించిన ప్రభు త్వం ఫీజుల నిర్థారణపై త్వరలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది.
ఇ తర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజులను ఆ కమిటీ పరిశీలిస్తుందని, వాటితోపాటు అ న్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సు ప్రీం కోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకుంటామ ని తెలిపింది. తాజా హైకోర్టు ఉత్తర్వుల నే పథ్యంలో త్వరగా నిపుణుల కమిటీ నియమించిఉన్నత న్యాయస్థానం నిర్ధేశించిన ఆ రు వారాల్లోగా ఫీజులు ఖరారు చేయనున్న ట్లు సమాచారం. అయితే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు ప్ర క్రియ ముగిసింది. ఈనెల 18వ తేదీన మొ దటి విడత సీట్లు కేటాయించనున్నారు. సీ ట్లు పొందిన విద్యార్థులు జులై 18 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చే యాలి. వెబ్‌సైట్‌లో ఇంజనీరింగ్ బ్రాంచీ, కాలేజీ వివరాలతో
పాటు ఫీజులు పొందుపరచాల్సి ఉండగా, ప్రస్తుత విద్యాసంవత్సరానికి పాత ఫీజులనే వెబ్‌సైట్‌లో పొందుపరించారు.
కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు విద్యార్థులు పాత ఫీజులే చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడితే ఫీజులలో ఏమైనా మార్పులు ఉంటే ఆ మార్పులకు అనుగుణంగా ఫీజులు చెల్లించేలా షరతు విధించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం(2025 -26)లో సిబిఐటి వార్షిక ఫీజును రూ.2.23 లక్షలుగా ఉండనున్నది. ఈ మేరకు సిబిఐటి కాలేజీ వార్షిక ఫీజును రూ.2.23 లక్షలుగా తీసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే వసూలు చేసిన ఫీజులు పిటిషన్‌పై తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వులను పునఃసమీక్షించాలని హైకోర్టును కోరనున్నది. కాగా, రాష్ట్రంలో సిబిఐటి కాలేజీదే అత్యధిక ఫీజు.
ముగిసిన వెబ్ ఆప్షన్ల నమోదు..18న సీట్ల కేటాయింపు
రాష్ట్రంలో ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా గురువారం(జులై 10) రాత్రి 12 గంటలకు కీలకమైన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ముగిసింది. మొత్తం 95256 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాగా, అందులో 94059 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఈసారి కొత్తగా జోసా తరహాలో ఈ నెల 13వ తేదీన మాక్ సీట్ కేటాయింపు చేయనున్నారు.ఈ నేపథ్యంలో మాక్ కౌన్సెలింగ్ కోసం 5663308 వెబ్ ఆప్షన్లు నమోదు కాగా, అందులో ఒక విద్యార్థి అత్యధికంగా 1051 వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఈ నెల 13న మాక్ సీట్ కేటాయింపు తర్వాత ఈ నెల 14, 15 తేదీలలో అవసరమైతే వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 18వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు జులై 18 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
ఫీజుల నియంత్రణ కమిటీకి ఆదేశం
ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురయింది. ఫీజులు పెంచాలని దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఫీజుల పెంపు కోసం ఇచ్చిన వినతులపై ఫీజుల నియంత్రణ కమిటికి(టిఎఎఫ్‌ఆర్‌సి) ఆరు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది. ఫీజుల పెంచడాన్ని ప్రభుత్వ నిరాకరణను సవాల్ చేస్తూ సుమారు 11 ఇంజనీరింగ్ కళాశాలలు పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం ప్రైవేటు కళాశాలల పిటిషన్లు కొట్టివేసింది. మూడేళ్లకోసారి కళాశాలలను పరిశీలించి పెంపుపై నిర్ణయం తీసుకోలేదని, 15మంది సభ్యులు ఉన్న కమిటీ నిర్ణయంలో జాప్యమెందుకని కోర్టు టిఎఎఫ్‌ఆర్‌సిని ప్రశ్నించింది. దీంతో పాటు టిఎఎఫ్‌ఆర్‌సిపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని, కౌన్సిలింగ్ పూర్తయ్యాక పిటిషన్‌లు వేయడం ఏమిటని కళాశాలలను సైతం ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.