హైదరాబాద్: లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లాండ్ మధ్యజరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 43 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. యశస్వి జైస్వాల్ 13 పరుగులు చేసి జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో హరీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
కరుణ్ నాయర్ 40 పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ మైదానం వీడాడు. శుభ్‌మన్ గిల్ 16 పరుగులు చేసి క్రిష్ వోక్స్ బౌలింగ్‌లో జేమీ స్మీత్‌కు క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్(53), రిషబ్ పంత్(19) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 242 పరుగుల వెనుకంజలో ఉంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు తీయగా సిరాజ్, నితీష్ రెడ్డి చెరో రెండు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు.