- Advertisement -
మల్టీ టాలెంటెడ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘సీతా పయనం’.(Sita payanam) శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్, నిరంజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అర్జున్, ధ్రువ సర్జా పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. గద్దర్ భార్య విమలా గద్దర్ ఈ సినిమా నుంచి ఏ ఊరికెళ్తావే పిల్లా పాటను లాంచ్ చేశారు. కనకవ్వ, గంగవ్వ, జోగిని శ్యామల, బేబీ లాంటి జానపద కళాకారుల సమక్షంలో (Presence folk artists) సీత పయనం టీం అందరిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో గద్దర్ కుమార్తె వెన్నల గద్దర్ కూడా పాల్గొన్నారు. అనూప్ రూబెన్స్ ఈ సాంగ్ ని ఎనర్జిటిక్ ఫోక్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్, మధు ప్రియ తమ గాత్రంతో కట్టిపడేశారు. చంద్రబోస్ సాహిత్యం అందరినీ ఆకట్టుకుంది.
- Advertisement -