Sunday, July 13, 2025

బాలాపూర్‌ లో చిరుతల సంచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: బాలాపూర్‌ శివారు ప్రాంతాల్లో చిరుతల సంచారం కలకలం సృష్టిస్తోంది. బాలాపూర్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌  ప్రాంగణంలో చిరుతల సంచరించినట్టు స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెండో రోజుల క్రితం రెండు చిరుతలు సంచరించాయని ఓ సెక్యూరిటీ గార్డు గుర్తించారు. సిసి కెమెరాల్లో చిరుతలు సంచిరించినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుతలు సంచరించడంతో బాలాపూర్ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఫెన్స్‌ అధికారులు హెచ్చరించారు. అటవీ శాఖ అధికారులు చిరుతలను బంధించే పనిలో నిమగ్నమయ్యారు. డ్రోన్ల సహాయంతో చిరుతలను గుర్తిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు చేస్తున్నారు.  అటవీ విస్తీర్ణం తగ్గడంతోనే వన్యప్రాణులు నగర ప్రాంతాల్లో  చొచ్చుకొని వస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని వన్యప్రాణులు జనసంచారంలోకి రాకముందే అటవీ విస్తీర్ణం పెంచడంతో పాటు వాటికి సౌకర్యాలు కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. వన్యప్రాణాలు నగర శివారులకు రావడం అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. గతంలో శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో రెండు చిరుతలను పట్టుకున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లాలో ఇక్రిశాట్ సమీపంలో కూడా ఒక చిరుతను బంధించిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News