Saturday, July 12, 2025

సంబరాలు చేసుకోవడానికి నేనేమైనా 22 ఏళ్ల కుర్రాడినా?: బుమ్రా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్లు తీసుకున్నాడు. దీంతో లార్డ్స్ లో ఆనర్స్ బోర్డుపై బుమ్రా పేరు నమోదుకు అవకాశం దక్కించుకొని చరిత్ర సృష్టించాడు. టెస్టులో బుమ్రా ఇప్పటివరకు 15 సార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు. విదేశీ గడ్డలో 12 సార్లు తీయగా భారత్ గడ్డపై మూడు సార్లు ఐదు వికెట్లు తీశాడు. విదేశాల్లో కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్ 11 సార్లు ఐది వికెట్లు తీయగా ఆ రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.

రెండో రోజు ఆట ముగిసిన వెంటనే బుమ్రా మీడియాతో మాట్లాడారు. ఐదో వికెట్ తీసుకున్న తరువాత తాను ఎక్కువగా సంబరాలు చేసుకోలేదని బుమ్రా తెలిపారు. మైదానంలో చాలా సేపు బౌలింగ్ చేయడంతో అలసిపోయానని వివరణ ఇచ్చాడు. ఐదో వికెట్ తీయగానే ఎగిరి గంతులు వేయడానికి తాను 22 ఏళ్ల కుర్రాడిని కాదు అని పేర్కొన్నారు. ఐదో వికెట్ తీసిన వెంటనే సంబరాలు చేసుకోకుండా బౌలింగ్ చేయడానికి వెళ్లానని తెలియజేశారు.

లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లాండ్ మధ్యజరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 43 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు తీయగా సిరాజ్, నితీష్ రెడ్డి చెరో రెండు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News