Saturday, July 12, 2025

కోక భిక్షానికి భారత్ సేవా రత్న జాతీయ అవార్డు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మోత్కూర్: ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ తన వంతు సామాజిక సేవలందిస్తున్న మోత్కూర్ మున్సిపల్ పరిధిలోని బుజులాపురానికి చెందిన ఆర్‌ఎంపి వైద్యుడు కోక బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోక భిక్షానికి మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత్ సేవా రత్న జాతీయ అవార్డు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని త్యాగరాజగానసభలో అవార్డు అందుకున్నట్లు తెలిపారు. పేద ప్రజల కోసం ఐదేళ్లుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి అవార్డు, ప్రశంసా పత్రం అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మనం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చక్రవర్తి, ఈయస్ నల్లపరాజు, రాజేంద్రకుమార్, ప్రణయ్, దైవజ్ఞశర్మ, శివలీల, సింగర్ అర్చన తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News