Saturday, July 12, 2025

పెద్ది పోస్టర్ విడుదల… శివ రాజ్ కుమార్ లుక్ అదిరిపోయింది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెద్ది సినిమాలో మెగాపవర్ రామ్‌చరణ్‌కు తోడు జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, జగపతి బాబు నటిస్తున్నారు. శివ రాజ్‌కుమార్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా యూనిట్ స్పెషల్ సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. ఈ మూవీలో రాజ్‌కుమార్ లుక్‌ను విడుదల చేసింది.

గౌర్నాయుడు పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. గ్రామ పెద్ద తరహాలో ఆయన నటిస్తున్నట్టు సమాచారం. హ్యాఫీ బర్త్ డే శివన్న అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. హ్యాపీ బర్త్‌డే శివన్న, గొప్ప వ్యక్తులతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. సెట్‌లో రాజ్ కుమార్ ఉన్నారంటే మాకు స్ఫూర్తి నిస్తుందని కొనియాడారు. శివన్న ఎప్పుడు సంతోషంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గ్రామీణ నేపథ్యంలో పాటు క్రికెట్ ఆటను ఈ సినిమాలో కనిపించనుంది. 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News