Sunday, July 13, 2025

ఎలాంటి వివాదాస్పద స్టేట్‌మెంట్లు ఇవ్వదలచుకోలేదు: బుమ్రా

- Advertisement -
- Advertisement -

లండన్: లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రెచ్చిపోయాడు. ప్రత్యర్థి బ్యాటర్లను తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు. 27 ఓవర్లలో 74 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అయితే మూడో టెస్ట్‌లో జరిగిన బంతి మార్పు గురించి సర్వత్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుత క్రికెటర్లు, మాజీలు దీని గురించి కామెంట్లు చేస్తున్నారు. అయితే బంతి మార్పునకు గురించిన ప్రశ్న బుమ్రాకు కూడా ఎదురైంది.

దీనికి బుమ్రా (Jasprit Bumrah) చాలా సరదగా సమాధానం ఇచ్చాడు. బంతిలో మార్పులను నియంత్రించడం కష్టమే అని చెప్పిన బుమ్రా.. దాని గురించి మాట్లాడి.. తన సొమ్మును పొగొట్టుకోనని అన్నాడు. తను చాలా కష్టపడి.. చాలా ఓవర్లు బౌలింగ్ చేశానని.. ఇప్పుడు వివాదాస్పద స్టేట్‌మెంట్లు ఇచ్చి చిక్కుల్లో పడనని పేర్కొన్నాడు. బంతిలో మార్పులను మనం మార్చలేమని.. అలాగే దానిపై పోరాటం చేయలేమని తెలిపాడు. దీనిపై మాట్లాడి మ్యాచ్ ఫీజు పోగొట్టుకోలేనన్నాడు. కొన్నిసార్లు నిర్ణయాలు మనకి అనుకూలంగా వస్తాయని.. కొన్నిసార్లు రావని స్పష్టం చేశాడు. ఇక లార్డ్స్ ఆనర్ బోర్డుపై తన పేరు ఎక్కడం చాలా సంతోషంగా ఉందని బుమ్రా తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News