హైదరాబాద్: మంచు విష్ణు లీడ్ రోల్‌లో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన మైథలాజికల్ చిత్రం ‘కన్నప్ప’. జత నెల 27వ తేదీన విడులైన ఈ సినిమాకు ఆరంభంలో మంచి కలెక్షన్లే వచ్చినా.. ఆ తర్వాత క్రమంగా కలెక్షన్లు తగ్గు ముఖం పట్టాయి. అయితే సినిమా విడుదలకు ముందే.. చిత్రంపై నెగెటివ్ కామెంట్లు చేయొద్దని చిత్ర యూనిట్ హెచ్చరించింది. కానీ, సినిమాపై ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. సినిమా అట్టర్ ఫ్లాప్ అని, డిజాస్టర్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ట్రోల్స్‌పై మోహన్ బాబు (Mohan Babu) స్పందించారు.
విమర్శ, సద్విమర్శ, ప్రకృతి- వికృతి రెండు ఉంటాయని ఆయన అన్నారు. ఈ సినిమా గురించి ఓ పండితుడిని సంప్రదించగా,, అయన ఏమన్నాంటే ‘‘నేను అంతా గమనిస్తున్నాను. గత జన్మలో లేదా ఈ జన్మలో చేసిన తప్పులు ఉంటే ఇలా విమర్శించే వాళ్లు మీ కర్మను తీసుకెళ్తున్నారని అర్థం. కాబట్టి వారిని ఆశీర్వదించండి’’ అని అన్నారని తెలిపారు. విమర్శించే వాళ్ల గురించి తాను ఏం మాట్లాడను అని.. వాళ్లు, వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని మోహన్ బాబు (Mohan Babu) అన్నారు.