Saturday, July 12, 2025

లోయలో పడిన వాహనం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రం రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం వాహనం లోయలో పడింది.  ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. గాయపడిన ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో యావర్ అహ్మద్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. యుక్రల్ పోగల పరిస్తాన్ ప్రాంతంలోని సేనాబాతిలో రోడ్డుపక్కన ఉన్న 600 అడుగుల లోయలో పర్యాటకుల వాహనం పడింది. రెస్య్కూ సిబ్బంది, అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు లక్ష రూపాయలు, గాయపడిన 25 వేల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతులు తౌఖర్ అహ్మద్, షకీల్ అహ్మద్, గాయపడిన వారు మహ్మద్ రఫీక్, అబ్దుల్ లతీఫ్, అజాజ్ అహ్మద్‌గా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News