మేషం: మేష రాశి వారికి ఈ వారం కొన్ని సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. రాబడి ఏ విధంగా ఉంటుందో ఖర్చులు కూడా దానికి సమానంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. విదేశీ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. అఘోర పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా కొంత ఒత్తిడికి లోనవుతారు. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ ఈ వారం మీ చేతికి అందుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ పొంతనలు చూసుకుని ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయాలి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.
వృషభం:వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది ఉద్యోగం చేసే వారికి అయినా వ్యాపారం చేసే వారి కైనా సరే ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. అవసరాల నిమిత్తం సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఈ రాశి వారు తమ ఆలోచన విధానాన్ని కొంతమేరకు మార్చుకోవాల్సి ఉంటుంది. నిత్యవసర వస్తువులు అమ్మే వారికి చిరు వ్యాపారస్తులకు ఈవారం అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తల్లి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులను ఖర్చు పెట్టే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ మార్పిడి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. విదేశీ వ్యవహారాల విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగం రాదు అనుకున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు అమ్మవారి ఆరాధన చేయడం మంచిది ప్రతిరోజు కుబేర కుంకుమతో అమ్మవారికి పూజ చేయండి అలాగే విష్ణు ఆరాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.
మిథునం:మిధున రాశి వారికి ఈ వారం గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా తోటి ఉద్యోగస్తులతో చిన్నచిన్న విభేదాలు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. వ్యాపారపరంగా లాభాలు బాగున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి లీజులు లైసెన్సులు చేతికి అందుతాయి. ధనాన్ని సేవింగ్స్ రూపంలో పెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. సినిమా రంగంలో ఉన్నవారికి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ లోపించకుండా జాగ్రత్త వహించాలి. ప్రతి రోజు కూడా జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. సౌర కంకణం చేతికి ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంకేతం 9 కలిసి వచ్చే రంగు గ్రే.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. కుటుంబ అవసరాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. సంబంధం కుదురుతుంది. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు ఈ వారం తొలగిపోతాయి. చిరు వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. శివారాధన ఎక్కువగా చేస్తారు. గో సేవ చేయండి. వివాహ పొంతన చేసేటప్పుడు ఇద్దరి జాతకాలు విడివిడిగా చూసి ఒక నిర్ణయానికి రండి. ప్రతి రోజు లక్ష్మీ తామర వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రీన్.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. చేపట్టిన పనులు నిదానంగా సాగడం, వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోకపోవడం, కోపం అధికంగా కలిగి ఉండడం జరుగుతుంది. ఎప్పటినుండో వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ అవసరాలకు తగిన ధనం అందుతుంది. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా బాగున్నప్పటికీ ఏదో తెలియని చికాకులు వెంటాడుతాయి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు.
కన్య:కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యస్వామి వారి అష్టకం చదవండి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యమైన విషయాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రతిరోజు కూడా అమ్మవారిని కుబేర కుంకుమతో పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు ఎల్లో.
తుల:తులారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. రావలసిన బెనిఫిట్స్ కూడా చేతికి అందుతాయి. గత కొన్ని వారాలుగా వ్యాపారాలలో నష్టాలు ఎదుర్కొంటున్న వారు ఈ వారం లాభాలు చూస్తారు. సాధ్యమైనంతవరకు ధనాన్ని సేవింగ్స్ రూపంలో పొదుపు చేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కొంతమంది విషయంలో కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో కొంతవరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మీరు సొంతంగా చేసే వ్యాపారాలు లాభాల దిశలో ఉంటాయి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు లైట్ పింక్.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. భగవత్ సంకల్పం వల్ల మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారాలపరంగా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ప్రతిరోజు కూడా ఆరావలి కుంకుమతో అమ్మవారిని పూజించండి. అలాగే ప్రతిరోజు ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. విష్ణు సహస్రనామాలు వినడం గాని చదవడం కానీ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు ఎరుపు.
ధనస్సు:ధనస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నారు. రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగి పోతాయి. ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటే శ్రావణమాసంలో ప్రారంభించండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం మీకు లభిస్తుంది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు.
మకరం:మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి పనులు నిదానంగా సాగుతాయి. వివాహం కాని వారికి వివాహ విషయంలో కొంత జాప్యం ఏర్పడుతుంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ అందుతాయి. క్రెడిట్ కార్డుకి దూరంగా ఉండండి. హోమ్ లోన్స్ కి కూడా దూరంగా ఉండటం మంచిది. కష్టేఫలి అన్నట్టుగా ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ప్రతిరోజు కూడా అరటి నార వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 3 కలిసి వచ్చే రంగు తెలుపు.మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ కి దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధాలు చేతి వరకు వచ్చి చేజారి పోతాయి. నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఉద్యోగ పరంగా చక్కగా రాణించగలుగుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి మంచి కాలం రాబోతుందని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా గురుగ్రహ స్తోత్రాన్ని చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి 5 కలిసివచ్చే రంగు కాషాయం.
కుంభం:కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంతా అనుకూలంగా లేదు. మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడతాయి. వ్యాపార పరంగా అంతా గొప్పగా లేదని చెప్పవచ్చు. కలిసి వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి అఘోర పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. తప్పుడు సలహాలు వినడం వలన తప్పుడు ఆలోచనలు చేయడం వలన మీరు నష్టపోయే అవకాశం ఉంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. నమ్మిన వాళ్లు మోసం చేశారని బాధ ఎక్కువగా ఉంటుంది. రోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. శనికి జపాలు హోమాలు చేయించండి. ప్రతిరోజు కూడా ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.
మీనం: మీన రాశి వారికి ఈ వారం చాలా బాగుంది అని చెప్పవచ్చు. మీన రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తున్నప్పటికీ శని బలంగా ఉన్నారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ కి దూరంగా ఉండాలి. సంతానం చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కాలం అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని, శని గ్రహ స్తోత్రం చదవాలి. దేశాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజ సేవలో పాల్గొంటారు. గో సేవ చేస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు.