న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకుడిగా అవతారం ఎత్తారు. గతంలో ఆయన ‘ఓం జై జగదీష్’ అనే సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఆయన ‘తన్వీ ది గ్రేట్’ (Tanvi The Great) అనే సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. రాష్ట్రపతి భవన్‌లో ఆమకోసం ప్రత్యేక షో వేశారు. చిత్ర బృందంతో కలిసి రాష్టపతి ఈ సినిమా చూశారు. ఈ విషయాన్ని అనుపమ్ ఖేర్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.
‘‘త్రివిధ దళలకు అధిపతి, సుప్రీం కమాండర్ మా సినిమాను చూడటం సంతోషంగా ఉంది. సినిమా చివర్లో ఆమె చప్పట్లు కొట్టడం చూసి నా కల సాకారమైంది. ఒక దర్శకుడిగా ఇంత కన్న ఏం ఆశించగలను’’ అని ఆయన అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. భారత సాయుధ దళాలకు నివాళిగా ‘తన్వీ ది గ్రేట్’ (Tanvi The Great) సినిమాను రూపొందించారు. శుభాంగి దత్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, అరవింద స్వామి, బొమన్ ఇరానీ, పల్లవి జోషి, నాజర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు. జులై 18న ఈ సినిమా విడుదల కానుంది.