కోడాక్ ఇండియా, జియోటెలిఓఎస్‌తో భాగస్వామ్యంలో తన తొలి స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. భారత వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కోడాక్ 43 అంగుళాల 4K QLED మోడల్ (KQ43JTV0010) ప్రత్యేకంగా రూపొందించారు. ఈ టీవీ బెజెల్-లెస్ డిజైన్, 4K QLED (3840 x 2160 పిక్సెల్స్) స్క్రీన్, HDR సపోర్ట్, 40W డాల్బీ డిజిటల్ ప్లస్ స్టీరియో బాక్స్ స్పీకర్లు కలిగి ఉంది.
ధర
ఈ టీవీ ధర రూ. 18,990గా నిర్ణయించారు. దీని అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ 1-సంవత్సరం వారంటీతో వస్తుంది.
ఫీచర్లు
ఈ స్మార్ట్ టీవీ జియోటెలిఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు 200+ యాప్‌లు, 300+ ఉచిత లైవ్ ఛానెల్స్, 300+ JioGames, AI ఆధారిత కంటెంట్ సిఫార్సులు పొందవచ్చు. అలాగే,క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ వంటి క్రీడలకు రియల్-టైమ్ అప్‌డేట్స్ కోసం ప్రత్యేక స్పోర్ట్స్ హబ్ కూడా కలిగి ఉంది. వాయిస్-సపోర్ట్ రిమోట్‌లో నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా, యూట్యూబ్ కోసం ప్రత్యేక బటన్‌లు కూడా అందించారు.
డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, Amlogic చిప్‌సెట్, 2GB RAM, 8GB స్టోరేజ్, 2x USB, 3x HDMI, RJ45, AV పోర్ట్, బ్లూటూత్ 5.0 వంటి ఫీచర్లు ఈ టీవీలో అందుబాటులో ఉన్నాయి. టీవీలో గూగుల్ అసిస్టెంట్, బహుభాషా వాయిస్ సెర్చ్, స్పోర్ట్స్ మోడ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.